Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

ఏజెన్సీలో నేతకాని కులాలకు సర్వ హక్కులు ఇవ్వాలి

On: January 8, 2026 5:01 PM

ఏజెన్సీలో నేతకాని కులాలకు సర్వ హక్కులు ఇవ్వాలి

ఏజెన్సీలో నేతకాని కులాలకు సర్వ హక్కులు ఇవ్వాలి

జనవరి 12న ములుగు జిల్లా కేంద్రంలో నిరసన

ములుగు, జనవరి 8 (తెలంగాణ జ్యోతి): ఏజెన్సీలో నేతకాని కులాలకు సర్వ హక్కులు ఇవ్వాలని ఈనెల 12న ములుగులో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నేతకాని సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు జమున రాజు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని నేతకాని కులస్తులకు భూమిపై భుక్తి హక్కులు కల్పించాలని, ఏజెన్సీ చట్టాలను సమగ్రంగా అమలు చేయాలని, అలాగే ఏజెన్సీ నేతకాని అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 12న ములుగు జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుల సంఘాలకు అతీతంగా నేతకాని కులస్తుల ఐక్యతతో ములుగు జిల్లా కేంద్రంలోని వద్ద ‘జై నేతకాని’ నినాదాలతో శాంతియుత నిరసన చేపడతామని తెలిపారు. అనంతరం ములుగు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి క్యాంపు కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి, ఏజెన్సీ ప్రాంతాల్లో నేతకాని కులాలకు సర్వ హక్కులు కల్పించాలని వినతిపత్రం సమర్పిస్తామని చెప్పారు. నేతకాని కులస్థులందరూ “మేము సైతం” అంటూ హక్కుల సాధన కోసం ఈ నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలని జమున రాజు పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!