Kavitha | కవిత రాజీనామాకు మండలి చైర్మన్ ఆమోదం

On: January 7, 2026 3:27 PM

Kavitha | కవిత రాజీనామాకు మండలి చైర్మన్ ఆమోదం

Kavitha | కవిత రాజీనామాకు మండలి చైర్మన్ ఆమోదం

ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం

హైదరాబాద్, జనవరి 7 తెలంగాణ జ్యోతి : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత సమర్పించిన రాజీనామాకు శాసన మండలి చైర్మన్ అధికారికంగా ఆమోదం తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల కావడంతో కవిత ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా మారింది. దీంతో ఆమె శాసన మండలి సభ్యత్వం నుంచి పూర్తిగా వైదొలిగినట్లైంది.

పార్టీ వ్యవహారాలపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రాజీనామా సమర్పించిన సమయంలో చైర్మన్ పునరాలోచించాలని సూచించినప్పటికీ, ఆమె తన నిర్ణయంపై స్థిరంగా నిలిచారు. చివరకు ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తూ రాజీనామాను ఆమోదించారు.

ఈ పరిణామంతో కవిత రాజకీయ భవితవ్యంపై ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. మరోవైపు, ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానంపై రాజకీయ పార్టీల కదలికలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!