Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

మల్లంపల్లి కెనాల్ వద్ద ట్రాఫిక్ జామ్

On: January 4, 2026 8:38 PM

మల్లంపల్లి కెనాల్ వద్ద ట్రాఫిక్ జామ్

మల్లంపల్లి కెనాల్ వద్ద ట్రాఫిక్ జామ్

ములుగు, జనవరి 4, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా  మల్లంపల్లి మండలం కెనాల్ వద్ద తీవ్ర ట్రాఫిక్ జామ్‌ నెలకొంది. మేడారం జాతరకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉన్న వందలాది వాహనాలు ఒకేసారి చేరడంతో జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. కెనాల్‌పై ఉన్న ఇరుకైన రహదారి కారణంగా వాహనాలు ముందుకు కదలలేక నిలిచిపోయాయి. పందికుంట బస్సు స్టేజ్‌ నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాల బారులు ఏర్పడ్డాయి. వాహనం వెనుక వాహనం నత్తనడకన సాగుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఈ స్థాయిలో పరిస్థితి ఉంటే, జాతర ప్రధాన రోజుల్లో ట్రాఫిక్ మరింత తీవ్రంగా మారుతుందేమోనని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!