ములుగు మున్సిపాలిటీ @ 20 వార్డులు
మున్సిపాలిటీ పరిధిలో 14,112 మంది ఓటర్లు
పురుషులు 67 31, మహిళలు 7379
648 మంది అధికంగా మహిళా ఓటర్లు
4 వరకు అభ్యంతరాల స్వీకరన, 10 న తుది జాబితా విడుదల
ములుగు, జనవరి 3 (తెలంగాణ జ్యోతి): ములుగు మున్సిపాలిటీ పరిధిలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. తాజా ఓటర్ల జాబితా ప్రకారం మున్సిపాలిటీలో మొత్తం 14,112 మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుష ఓటర్లు 6,731 మంది, మహిళా ఓటర్లు 7,379 మందిగా నమోదయ్యారు. పురుషులతో పోలిస్తే 648 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉండటం గమనార్హం. మున్సిపాలిటీ పరిధిలో రూపొందించిన ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణను నేటి వరకు కొనసాగించ నుండగా, అన్ని అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఈ నెల 10వ తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మే 29న ములుగు జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీగా ప్రకటించిన నేపథ్యంలో, జూన్ 4న ములుగు మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన చేపట్టింది. అప్పటివరకు మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న ములుగుకు బండారుపల్లి, జీవంతరావుపల్లి గ్రామపంచాయతీలను కలుపుతూ మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ మున్సిపల్ లా సవరణ ఆర్డినెన్స్ ప్రకారం మున్సిపాలిటీని మొత్తం 20 వార్డులుగా విభజిస్తూ అధికారిక ప్రకటన జారీ చేశారు. ఈ పునర్విభజనలో ములుగు పట్టణంతో పాటు బండారుపల్లి, జీవంత రావుపల్లి గ్రామాలకు చెందిన కాలనీలు, నివాస ప్రాంతాలను సమగ్రంగా కలుపుతూ వార్డుల మ్యాప్‌ను రూపొందించారు. జనాభా ప్రాతిపదికన ప్రతి ప్రాంతానికి సమాన ప్రాతినిధ్యం కల్పించడమే లక్ష్యంగా ఈ విభజన చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. తాజా ఓటర్ల జాబితాలో తమ పేరు, చిరునామా, వయస్సు వివరాలు సరిగా నమోదయ్యాయా లేదా అన్న విషయాన్ని ప్రతి ఓటరు తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, ఎలాంటి పొరపాట్లు ఉన్నా అభ్యంతరాల గడువులోపు సంబంధిత అధికారులను సంప్రదించాలని ఎన్నికల అధికారులు సూచించారు.
| వార్డు | కాలనీలు / ప్రాంతాలు | పురుషులు | మహిళలు | ఇతరులు |
|---|---|---|---|---|
| 1 | జీవంతరావుపల్లి, గణేశ్‌లాల్‌పల్లి | 323 | 350 | 0 |
| 2 | పాల్సాబ్‌పల్లి, గడిగడ్డ | 348 | 412 | 1 |
| 3 | బెస్తవాడ, వడ్డెరవాడ, సుభాష్‌నగర్, సఫాయి వాడ | 344 | 410 | 0 |
| 4 | లక్ష్మీనగర్, గాంధీ పార్క్, బస్టాండ్, డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్, లిటిల్ ఫ్లవర్ స్కూల్ | 374 | 375 | 0 |
| 5 | బృందావన్ కాలనీ (కొంత భాగం), ఎస్సీ కాలనీ | 315 | 378 | 0 |
| 6 | కాపు వాడ | 330 | 321 | 0 |
| 7 | మాధవరావుపల్లి, వీవర్స్ కాలనీ, దుర్గా కాలనీ | 362 | 364 | 0 |
| 8 | ప్రేమ్‌నగర్, ప్రగతి కాలనీ, ఏరియా ఆసుపత్రి వెనుక భాగం, ఆదర్శ కాలనీ | 360 | 370 | 0 |
| 9 | కృష్ణా కాలనీ, బీసీ కాలనీ, సాధన స్కూల్, బండారుపల్లి మెయిన్ రోడ్ | 300 | 330 | 0 |
| 10 | బండారుపల్లి, హనుమాన్ గుడి, పోచమ్మ గుడి, మసీదు, మెయిన్ రోడ్ | 359 | 396 | 1 |
| 11 | బీరన్న టెంపుల్ ఏరియా, సర్దార్ పటేల్ కాలనీ, మదర్ థెరిసా కాలనీ, అటల్ బిహారీ కాలనీ | 338 | 363 | 0 |
| 12 | మహాత్మా గాంధీ కాలనీ, వివేకానంద కాలనీ, నెహ్రూ కాలనీ, మెయిన్ రోడ్ | 372 | 397 | 0 |
| 13 | జగ్జీవన్‌రాం కాలనీ, సుభాష్ చంద్రబోస్ కాలనీ, భగత్‌సింగ్ కాలనీ | 393 | 375 | 0 |
| 14 | ఎంపీడీవో కార్యాలయం, హనుమాన్ బస్తీ, చాకలి వాడ, ఫారెస్ట్ ఏరియా, కలెక్టరేట్ | 369 | 420 | 0 |
| 15 | రంగారావుపల్లి, పోలీస్ స్టేషన్, కోర్టు ఏరియా | 352 | 357 | 0 |
| 16 | నాయకపోడ్ కాలనీ, పైడిమల్ల స్ట్రీట్, ఏపీజీవీబీ బ్యాంక్ | 315 | 344 | 0 |
| 17 | శివాలయం వెనుక భాగం, ఎక్సైజ్ కార్యాలయం | 328 | 327 | 0 |
| 18 | ఫకీర్ వాడ, గొల్ల వాడ, మార్కెట్ ఏరియా | 295 | 353 | 0 |
| 19 | వీవర్స్ కాలనీ, పెద్దమ్మతల్లి టెంపుల్ | 288 | 345 | 0 |
| 20 | ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, నాయకపు వాడ (కొంత భాగం), మున్సిపల్ కార్యాలయం | 332 | 392 | 0 |
| మొత్తం | 6,731 | 7,379 | 2 | |






