వెంకటాపురంలో ఘనంగా పొదెం వీరయ్య జన్మదిన వేడుకలు
వెంకటాపురం నూగూరు, జనవరి 2 (తెలంగాణ జ్యోతి): వెంకటాపురం నూగూరు మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం ఆవరణలో శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, అటవిశాఖ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య జన్మదిన వేడుకలను వెంకటాపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలను పంపిణీ చేశారు. కార్యకర్తలు జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలతో కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాలసాని వేణు, బీసీ మరి గూడెం సర్పంచ్ సురిటి రాజేశ్వరి, కిసాన్ సెల్ నేత జల్లిగంపల కళాధర్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు క్రాంతి కిరణ్, సీనియర్ నాయకులు అన్వర్ భాష, డర్ర రవి, మాజీ ఎంపిటిసి రవి, నాయకులు వేల్పూరి సత్యనారాయణ, మద్దుకూరి ప్రసాద్, కే. శ్రీను తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు హాజరై వేడుకలను విజయవంతం చేశారు.






