కలెక్టర్‌ను కలిసిన పంచాయతీరాజ్ శాఖ స్టేట్ డైరెక్టర్ భగవాన్ రెడ్డి
ములుగు, జనవరి2, (తెలంగాణ జ్యోతి): పంచాయతీరాజ్ శాఖ స్టేట్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి శుక్రవారం ములుగు జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. పంచాయతీరాజ్ శాఖ స్టేట్ డైరెక్టర్‌గా నియామకమైన అనంతరం తొలిసారిగా కలెక్టర్‌ను కలిసిన భగవాన్ రెడ్డికి కలెక్టర్ దివాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వెంకటాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బండి శ్రీనివాస్‌తో పాటు నాయకులు బుర్ర సమ్మయ్య గౌడ్, మాడుగుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.






