అంబులెన్సులో మహిళకు సురక్షిత ప్రసవం
కన్నాయిగూడెం,జనవరి1,తెలంగాణజ్యోతి: కన్నాయిగూడెం మండలం లో 108 అంబులెన్సులో మహిళ సురక్షితంగా ప్రసవించిన ఘటన చోటుచేసుకుంది. గూర్రేవుల గ్రామానికి చెందిన వాసంపల్లి మహేశ్వరీకి పురిటి నొప్పులు రావడంతో ఆమె భర్త వాసంపల్లి నవీన్ 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్సు పైలెట్ రవీందర్, ఈఎంటీ మహేశ్వరీ హుటాహుటిన గ్రామానికి చేరుకుని, గర్భిణిని మెరుగైన వైద్య సేవల కోసం ఏటూరునాగారం తరలించారు. మార్గమధ్యలో పురిటి నొప్పులు అధికమవడంతో ఈఎంటీ మహేశ్వరీ చాకచక్యంగా వ్యవహరించి అంబులెన్సులోనే సురక్షితంగా ప్రసవం నిర్వహించడంతో తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారు.






