వృద్ధులకు దుప్పట్లు పంపిణీ
వెంకటాపురం నూగూరు, జనవరి 01, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని కమ్మరిగూడెం గ్రామంలో, గురువారం 30 మంది వృద్ధులకు మరి కాల చర్చి పాస్టర్ జారి ముత్తయ్య దుప్పట్లు పంపిణీ చేశారు. గజ గజ వణికే చలి నీ తట్టుకోలేక వృద్ధులు అనేక ఇబ్బందులుతోపాటు నిద్రలేముతో భాధ పడుతున్నారని, తెలుసుకొని గ్రామంలోని 30 మంది పేద వృద్ధులకు కమ్మరి గూడెం చర్చి ప్రాంగణంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ మేరకు గ్రామస్తులు, వృద్ధులు, చర్చి పాస్టర్ జారి ముత్తయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.






