ములుగు కలెక్టర్, ఎస్పీని కలిసిన రైస్ మిల్లర్స్ ప్రతినిధులు
ములుగు, జనవరి1, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథన్ కేకన్లను గురువారం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షులు బాదం ప్రవీణ్ మర్యాద పూర్వకంగా కలిశారు. నూతన సంవత్సరం సందర్భంగా కలెక్టర్, ఎస్పీకి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాల తో సన్మానించారు. అలాగే ఎస్పీ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి సహోదరి రెడ్డి, కోశాధికారి ఎలగందుల మోహన్, గౌరవాధ్యక్షులు పల్లెపాటి సమ్మిరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొమురవెల్లి హరినాథ్‌తో పాటు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.






