ములుగు మున్సిపాలిటీ ఓటర్ల జాబితా విడుదల

On: January 1, 2026 1:04 PM

ములుగు మున్సిపాలిటీ ఓటర్ల జాబితా విడుదల

ములుగు మున్సిపాలిటీ ఓటర్ల జాబితా విడుదల

మొత్తం 20 వార్డులు – 14,112 మంది ఓటర్లు 

14వ వార్డులో అత్యధికం, 9వ వార్డులో అత్యల్పం

ములుగు, జనవరి 1, తెలంగాణ జ్యోతి : ములుగు మున్సిపాలిటీ పరిధి లోని తాజా ఓటర్ల జాబితాను మున్సిపాలిటీ కమిషనర్ జనగాం సంపత్ గురువారం అధికారికంగా విడుదల చేశారు.  మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా మొత్తం ఓటర్ల సంఖ్య 14,112గా నమోదైంది. వార్డుల వారీగా చూస్తే 1వ వార్డులో 673, 2వ వార్డులో 761, 3వ వార్డులో 754, 4వ వార్డులో 749, 5వ వార్డులో 693, 6వ వార్డులో 651, 7వ వార్డులో 726, 8వ వార్డులో 730, 9వ వార్డులో 630, 10వ వార్డులో 750, 11వ వార్డులో 701, 12వ వార్డులో 769, 13వ వార్డులో 708, 14వ వార్డులో 789, 15వ వార్డులో 709, 16వ వార్డులో 659, 17వ వార్డులో 655, 18వ వార్డులో 648, 19వ వార్డులో 633, 20వ వార్డులో 724 మంది ఓటర్లు ఉన్నారు. ఈ గణాంకాల్లో 14వ వార్డులో అత్యధికంగా 789 మంది ఓటర్లు ఉండగా, 9వ వార్డులో అత్యల్పంగా 630 మంది ఓటర్లు ఉన్నట్లు స్పష్టమైంది. ప్రజలు మున్సిపాలిటీ కార్యాలయంలో అందుబాటులో ఉంచిన ఓటర్ల జాబితాను పరిశీలించి, ఏవైనా పేరు చేర్పులు, తొలగింపులు లేదా సవరణలు అవసరమైతే ఈనెల 5 లోపు లోపు అభ్యంతరాలు తెలియజేయాలని అధికారులు సూచించారు. ఈనెల 10న తుది జాబితాను ప్రకటించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు డివిజన్ అధికారి రమేష్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌తో పాటు మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు.

ములుగు మున్సిపాలిటీ ఓటర్ల జాబితా విడుదల

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!