నిబంధనలకు విరుద్ధంగా మహదేవ్‌పూర్ ఎం ఏ ఓ కొనసాగింపు
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన చల్లా వెంకటేశ్వర రావు
కాటారం, డిసెంబర్ 31,తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలో వ్యవసాయ శాఖ సేవా నియమాలకు విరుద్ధంగా మండల వ్యవసాయ అధికారిఎం ఏ ఓ చిలుకబత్తిని సుప్రజ్యోతి అధికారిక ఉత్తర్వులు లేకుండా విధుల్లో కొనసాగుతున్నారని సామాజిక కార్యకర్త చల్లా వెంకటేశ్వర రావు ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్‌కు ఆన్‌లైన్ గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆమె ‘ఆన్ డ్యూటీ’ (OD) గడువు గత అక్టోబర్ 18తో ముగిసినా ప్రభుత్వం నుంచి పొడిగింపు ఆదేశాలు లేకపోయినా ఇప్పటికీ విధుల్లో కొనసాగడం పరిపాలనా దుర్వినియోగమని పేర్కొన్నారు. గడువు ముగిసిన అధికారిని రిలీవ్ చేయడంలో మహదేవ్‌పూర్ ADAతో పాటు జిల్లా వ్యవసాయ అధికారి (DAO) నిర్లక్ష్యం వహించారని, చెల్లుబాటు అయ్యే ఉత్తర్వులు లేకుండా విధుల్లో ఉంటూ ప్రభుత్వ నిధులు, అధికారిక సంతకాలు వినియోగించడం చట్టరీత్యా నేరమని విమర్శించారు. సదరు అధికారిని వెంటనే బాధ్యతల నుంచి తొలగించి, బాధ్యులైన ADA, DAOలపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు.






