Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

భూపాలపల్లి ఎస్సీ హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్ : కలెక్టర్ రాహుల్ శర్మ

On: December 30, 2025 5:43 PM

భూపాలపల్లి ఎస్సీ హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్ : కలెక్టర్ రాహుల్ శర్మ

కాటారం, డిసెంబరు 30,తెలంగాణ జ్యోతి :  జిల్లా కేంద్రంలోని ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థిని కొట్టిన ఘటనపై వార్డెన్ ను సస్పెండ్ చేసి పోలీస్ కేసు నమోదు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్సి హాస్టల్ ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తో ముఖాముఖీ అయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డిగ్రీ చదువుతున్న హాస్టల్ విద్యార్థిని కొట్టడం చాలా బాధాకరమని, తక్షణమే ఎస్సి అభివృద్ధి అధికారి ద్వారా విచారణ నిర్వహించి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వార్డెన్ పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. హాస్టల్‌లో జరిగిన ఈ ఘటనపై ప్రాథమిక విచారణ అనంతరం, విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు మరియు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు వార్డెన్‌ను తక్షణమే సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు బాధ్యురాలిపై శాఖాపరమైన చర్యలే కాకుండా, క్రిమినల్ కేసు కూడా నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.  సంక్షేమ అధికారిని ఈ ఘటనపై ప్రత్యేక విచారణాధికారిగా నియమించామని, ఇప్పటికే హాస్టల్‌ను సందర్శించి, విద్యార్థినులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించామన్నారు. బాధిత విద్యార్థినికి మరియు హాస్టల్‌లోని ఇతర విద్యార్థినులకు తగిన కౌన్సెలింగ్ ఇచ్చి, వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు చర్యలు చేపడ తామని తెలిపారు. హాస్టల్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని, జిల్లాలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు మరియు రెసిడెన్షియల్ స్కూళ్లలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. విద్యార్థుల భద్రత ప్రధమ ప్రాధాన్యతని, చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్ట పరంగా కఠినంగా శిక్షించబడతారని ఆయన స్పష్టం చేశారు. హాస్టల్ లో ప్రవేశించిన వ్యక్తి ఎవరు అనేది విచారణ జరుగుతున్నదని, విచారణ  నివేదిక రాగానే సంబంధిత వ్యక్తిపై పోలీస్ కేసు నమోదుతో పాటు కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఎస్సీ అభివృద్ధి అధికారి ఇందిర, సంక్షేమ అధికారి మల్లేశ్వరి, డీఈఓ రాజేందర్, ట్రైని డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!