జిల్లాలో పలువురు ఎస్సైలు బదిలీ
ములుగు, డిసెంబర్ 30, తెలంగాణ జ్యోతి : జిల్లాలో పోలీస్ పరిపాలన ను మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు శాంతిభద్రతలను బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ కాళేశ్వరం జోన్–1 డీజీపీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం ములుగు జిల్లా డీసీఆర్‌బీలో విధులు నిర్వహిస్తున్న కే.జగదీష్‌ను తాడ్వాయి ఎస్సైగా బదిలీ చేయగా, తాడ్వాయిలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై శ్రీకాంత్ రెడ్డిని ములుగు డీఆర్‌సీబీ ఎస్సైగా నియమించారు. అలాగే పస్రా ఎస్సైగా పనిచేస్తున్న ఏ.కమలాకర్‌ను నార్లాపూర్–మేడారం ఎస్సైగా బదిలీ చేయగా, ఆయన స్థానంలో భూపాలపల్లి సీసీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై తాజుద్దీన్‌ను పస్రా ఎస్సైగా నియమించారు. మేడారం జాతర, గిరిజన ప్రాంతాల భద్రత, అటవీ ప్రాంతాల పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని అనుభవం ఉన్న అధికారులను కీలక పోలీస్ స్టేషన్లకు బదిలీ చేసినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.






