ప్రగళ్ళపల్లి గ్రామీణ వైద్యుడు ఖాశీం మృతి
వెంకటాపురం, డిసెంబర్ 29, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం ప్రగళ్ళపల్లి గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు ఖాశీం (కాశీం) సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఖాశీం దశాబ్దాల కాలంగా ప్రగళ్ళపల్లి గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లో గ్రామీణ వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందారు. ఆయన ఆకస్మిక మృతితో వాజేడు మండలం ప్రగళ్ళపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో విషాదఛాయలు అలుముకు న్నాయి. ఆయన నుంచి వైద్య సేవలు పొందిన ప్రజలు, గ్రామస్తులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.






