వి.ఆర్.కె.పురం సర్పంచ్‌కు డ్వాక్రా మహిళల వినతిపత్రం
వెంకటాపురం, డిసెంబర్ 27, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని వి.ఆర్.కె.పురం గ్రామపంచాయతీ పరిధిలో స్వయం సహాయక పొదుపు సంఘాలు, డ్వాక్రా మహిళా సంఘాలకు సొంత భవనం నిర్మాణం కోసం 200 చదరపు గజాల స్థలం కేటాయించాలని కోరుతూ సంఘాల మహిళలు శనివారం గ్రామ సర్పంచ్ డి. రమ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు గ్రామసభలో తీర్మానం చేసి భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని మంజూరు చేయాలని సర్పంచ్‌ను కోరినట్లు తెలిపారు. సంఘాల సమావేశాలు, గ్రూప్ చర్చలు నిర్వహించేందుకు సొంత భవనం అత్యవ సరమైందని పేర్కొన్నారు. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేక భవనాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరారు. భవన నిర్మాణం కోసం స్థల కేటాయింపు విషయంలో సర్పంచ్‌తో పాటు గ్రామపంచాయతీ కార్యదర్శికి కూడా వినతిపత్రం అందజేసినట్లు విఓఏలు దాసరి రేఖ, బండారి శ్రీలక్ష్మి తెలిపారు.






