బండారుపల్లిలో యువకుడు అదృశ్యం
ములుగు, డిసెంబర్ 18, తెలంగాణ జ్యోతి : ములుగు మున్సిపాలిటీ పరిధిలోని బండారుపల్లి గ్రామానికి చెందిన సముద్రాల రాజేశ్వరరావు కుమారుడు బన్నీ (మానసిక స్థితి సరిగా లేదు, మాట్లాడలేడు) ఈరోజు మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అతను ఎవరికైనా కనిపిస్తే వెంటనే ఈ 9603222280 నంబర్‌కు సమా చారం ఇవ్వాలని కోరారు.
హనుమకొండలో యువకుడి ఆచూకీ లభ్యం
నిన్న తప్పిపోయిన మానసిక వికలాంగుడు సముద్రాల రాజేశ్వరరావు కుమారుడు బన్నీ ఆచూకీ లభ్యమైంది. ములుగు పరిధి బండారుపల్లికి చెందిన బన్నీ గురువారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. ప్రైవేట్ వాహనంలో హనుమకొండకు వెళ్లిన బన్నీని స్థానికులు మల్లికాంబ మనోవికాస కేంద్రంలో చేర్పించారు.






