జిపి ఎన్నికల కౌంటింగ్ సమయంలో అపశ్రుతి
వెంకటాపురం ఎంపీడీవో రాజేందర్ ప్రసాద్‌కు గుండెపోటు
ములుగు, డిసెంబర్ 17, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లాలో మూడో విడత సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న సమయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. వెంకటాపురం మండల ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న రాజేందర్ ప్రసాద్‌కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. వెంటనే స్పందించిన అధికారులు ఆయనను 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ములుగుకు సీపీఆర్ చేసి తరలించారు. అనంతరం ఇంట్యూబేషన్ చేసి శ్వాసనాళంలో ట్యూబ్ ఏర్పాటు చేసి కృత్రిమ శ్వాస అందించారు. ఈ చికిత్సల్లో డాక్టర్ యామిని (అనస్థీషియా), డాక్టర్ శ్రవణ్ కుమార్ (ఆర్ఎమ్ఓ), డాక్టర్ మునిష్ (జనరల్ మెడిసిన్) కీలకంగా పాల్గొన్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో, అత్యవసర వైద్యం నిమిత్తం ఆయనను ములుగు నుండి వరంగల్ ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు.







