Mulugu | జీపీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుభి
– 98స్థానాల్లో కాంగ్రెస్, 35 బీఆర్ఎస్ గెలుపు
– ముగిసిన పంచాయతీ ఎన్నికలు
ములుగు, డిసెంబర్17, తెలంగాణ జ్యోతి : గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. మూడు విడతల్లో అత్యధిక స్థానాలలో విజయదుందుభి మోగించింది. ములుగు జిల్లాలో 146 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా 98స్థానాల్లో కాంగ్రెస్, 35 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. సీపీఎం, బీజేపీ పార్టీల ప్రతినిధులు చెరొక స్థానం గెలుచుకోగా 11మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించడం విశేషం. కాగా, జీపీ ఎన్నికలు ముగియడంతో ఎన్నికల కోడ్ ముగిసినట్టేనని సర్వత్రా భావిస్తున్నారు. జీపీ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు ఊహించని విజయం సాధించిన అభ్యర్థులు విజయదరహారం పొందగా మరొకొందరు గెలుస్తామనుకొని ఓడిపోవడంతో నైరాశ్యంలో ఉన్నారు.
మూడో విడత సర్పంచ్ విజేతలు వీరే..
ములుగు జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మూడో విడతలో వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లో మొత్తం 46 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా, ఇందులో కాంగ్రెస్ 29, బీఆర్ఎస్ 9, బీజేపీ 1, సీపీఎం 1, స్వతంత్రులు 6 స్థానాల్లో విజయం సాధించారు. వెంకటాపురం మండలంలోని 18 జీపీలలో కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 4, సీపీఎం 1, స్వతంత్రులు 2 స్థానాలు దక్కించుకోగా, గెలుపొందిన సర్పంచ్‌లుగా తాటి సరస్వతి (వెంకటాపురం), నల్లబోయిన ఆదిలక్ష్మి (బర్లగూడెం), ఇండ్ల శ్రీను (నూగూర్), కుర్సం కన్నయ్య (మరికాల), మడే భీమేశ్వరి (బెస్తగూడెం), సూరిటీ రాజేశ్వర్ (బీసీ మరిగూడెం), చెరుకూరి రాధ (రాచపల్లి), ఎన్.రమ్య (వీఆర్‌కేపురం), జజ్జరి మానస (ఉప్పెడు వీరాపురం), బొగ్గుల పుష్పవతి (పాత్రపురం), సోలం ఓంపతి (వీరభద్రవరం), కోర్స నరసింహారావు (బోధపురం), శ్యామల వినిత (మొర్రివానిగూడెం), పద్దం సుశీల (రామచంద్రాపురం), పూజారి ఆదిలక్ష్మి (ఆలుబాక), చందా శిరీష (తిప్పాపురం), ఇర్ప మురళి (సూరవేడు), పర్షిక శ్రీలత (ఎదిర) ఎన్నికయ్యారు. వాజేడు మండలంలోని 17 జీపీలలో కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 3, బీజేపీ 1, స్వతంత్రులు 2 స్థానాలు గెలుచుకోగా, యాలం విజయలక్ష్మి (దూలపురం), బిరబోయిన పార్వతి (పెద్ద గొల్లగూడెం), కాక సుమతి (ధర్మవరం), చిడెం బాలకృష్ణ (టేకులగూడెం), దబ్బకట్ల సుమన్ (పూసూర్), గొంది సత్యనారాయణ (చీకుపల్లి), ఆలెం కళ్యాణి (కొంగాల), బోదెబోయిన భరత్ (గుమ్మడిదొడ్డి), అనుముల సంధ్యారాణి (చుండ్రుపట్ల), గోడ్డే సరోజిని (పేరూరు), బోధబోయిన స్వరూప (నాగారం), పూణేం విజయబాబు (కృష్ణాపురం), బెనిని (అయ్యవారిపేట), మడకం సుభద్ర (మొరుమూరు), అట్టం మమత (ఎడ్జర్లపల్లి), వాసం రాజబాబు (చెరుకూరు), తెల్లం సుమాంజలి (చింతూరు) సర్పంచ్‌లుగా గెలుపొందారు. కన్నాయిగూడెం మండలంలోని 11 జీపీలలో కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 2, స్వతంత్రులు 2 స్థానాలు సాధించగా, జాడి రాంబాబు (బుట్టాయిగూడెం), అగ్గు రోజా (లక్ష్మీపురం), పీర్ల సురేష్ (ఐలాపురం), పీర్ల స్వప్న (తుపాకులగూడెం), చింత చంద్రయ్య (కంతనపల్లి), కోరం నరసయ్య (సర్వాయి), అల్లెం అనిత (చింతగూడెం), తిప్పనపల్లి లసుమయ్య (ముప్పనపల్లి), కుర్సం రమాదేవి (ఏటూరు), అంబాల సౌజన్య (గూర్రేవుల), పొడెం నర్సింగరావు (రాజన్నపేట) గెలుపొందారు.







