బొట్ల ప్రశాంత్‌కు అభినందనలు తెలిపిన ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
ములుగు, డిసెంబర్ 17,తెలంగాణ జ్యోతి: ములుగు మండలం జాకారం గ్రామంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్‌గా విజయం సాధించిన బొట్ల ప్రశాంత్ ని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ గ్రామాభివృద్ధి కి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని తెలిపారు. బొట్ల ప్రశాంత్ మాట్లాడుతూ, గెలుపుకు సహకరించిన జాకారం గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని చెప్పారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






