సీనియర్ కార్యకర్త కుటుంబానికి కాంగ్రెస్ అండ
ములుగు, డిసెంబర్ 17 (తెలంగాణ జ్యోతి): ములుగు మండలంలోని పత్తిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త పర్ష సారంగం అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా నిలిచారు. రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా మార్గనిర్దేశంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల ఎన్నికైన నూతన సర్పంచ్ ధరావత్ సరిత & సారయ్య, ఉప సర్పంచ్ పోరిక భద్రు నాయక్, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు కలిసి పార్థివ దేహానికి నివాళులు అర్పించి, కుటుంబానికి రూ.10 వేల నగదు సహాయం తో పాటు 25 కిలోల బియ్యం అందజేశారు. మంత్రి సీతక్క గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటుందని నాయకులు భరోసా ఇచ్చారు.






