మా దేవుళ్ళ జోలికి వస్తే ఊరుకునేది లేదు

On: December 16, 2025 3:31 PM

మా దేవుళ్ళ జోలికి వస్తే ఊరుకునేది లేదు

మా దేవుళ్ళ జోలికి వస్తే ఊరుకునేది లేదు

– బిఆర్ఎస్ కీలక నేతల పై తీవ్ర విమర్శలు

– బీసీ రిజర్వేషన్లకు కేంద్రం అడ్డు

– రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

– జిపీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై హర్షం

ములుగు ప్రతినిధి, డిసెంబర్16, తెలంగాణ జ్యోతి : మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలు మా ఇలవేల్పులు అని, మా చరిత్ర చిరస్థాయిగా నిలిచేలా శిలలపై శిల్పాల రూపంలో చెక్కబడుతోందని, వారసత్వ సంపదగా నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మా దేవుళ్ళ జోలికి వస్తే ఊరుకునేది లేదని మాజీ ఇన్చార్జి మంత్రి పై పరోక్షంగా విమర్శలు చేశారు. మంగళవారం ములుగు క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి టిఆర్ఎస్ నాయకుల పై తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండు విడతలుగా నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటివరకు 8,566 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 61.24 శాతం ఓట్లతో రాష్ట్రవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. గ్రామస్థాయిలో పార్టీని గెలిపించిన కాంగ్రెస్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. బీసీ కులగణన ఆధారంగా 42 శాతం రిజర్వేషన్ లక్ష్యంతో కేంద్రంపై పోరాటం కొనసాగుతూనే, గ్రామాలకు పూర్తి స్థాయి నిధులు అందాలనే ఉద్దేశంతో ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చిందని వివరించారు. ములుగు నియోజకవర్గంలో మొత్తం 105 గ్రామ పంచాయతీ లలో 85కు పైగా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారని, కొన్నిచోట్ల కాంగ్రెస్ రెబల్స్ కూడా గెలిచారని తెలిపారు. సమ్మక్క–సారలమ్మ జాతర, ఆదివాసీ సంస్కృతి, ఆత్మగౌరవంపై తప్పుడు వ్యాఖ్యలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సహించెది లేదని స్పష్టం చేస్తూ రాళ్లు కాదు రాతి శిలలపై చెక్కబడిన చరిత్రే ఆదివాసీల అస్తిత్వానికి నిదర్శనమని అన్నారు. ఇళ్ల విషయంలో టిఆర్ఎస్ నాయకులు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తూ, పదేళ్లు అధికారంలో ఉండి కనీసం పది ఇళ్లైనా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గత ఏడాదిన్నర కాలంలోనే 5 వేల ఇళ్లు తీసుకొచ్చిందని తెలిపారు. మహిళలకు చీరలు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, పేద పిల్లలకు గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగాలు వస్తే కొందరికి కళ్లమంటగా మారిందని వ్యాఖ్యానించారు. మా దేవుళ్ల జోలికి వచ్చినా, మా అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా కాంగ్రెస్ ఊరుకునేది లేదని హెచ్చరించారు. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సొంత గ్రామం దేవగిరిపట్నం, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాల్వపల్లి లో కాంగ్రెస్ గెలిచిన విషయాన్ని కూడా వైరల్ చేయాలని హితోపలికారు. అసత్యాలు ప్రచారం చేయకుండా వాస్తవాలపై మాట్లాడు కుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, గ్రంథాలయ చైర్మన్ బానోతు రవి చందర్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!