మల్లంపల్లి వంతెన మరమ్మత్తుకు ట్రాఫిక్ మళ్లింపు

On: December 11, 2025 6:41 PM

మల్లంపల్లి వంతెన మరమ్మత్తుకు ట్రాఫిక్ మళ్లింపు

మల్లంపల్లి వంతెన మరమ్మత్తుకు ట్రాఫిక్ మళ్లింపు

ములుగు, డిసెంబర్ 11, తెలంగాణ జ్యోతి : జాతీయ రహదారి–163 మల్లంపల్లి వంతెన మరమ్మత్తు పనుల కారణంగా శుక్రవారం, రేపు శనివారం ఉదయం 9.30 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు ట్రక్కులు, లారీలు, బస్సులు, వ్యాన్లను గూడెంపాడు–పరకాల–రేగొండ– గాంధీనగర్–జంగాలపల్లి రూట్‌ మీదుగా మళ్లిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ప్రకటించారు. వంతెన వద్ద అబట్‌మెంట్ ఎ 1, ఎ 2 పనులు పూర్తయ్యి, ప్రీకాస్ట్ గ్రిడర్‌ల లాంచింగ్ కోసం భారీ క్రేన్‌లు, రవాణా వాహనాలు ఉపయోగించాల్సి రావడంతో ఈ ట్రాఫిక్ నియంత్రణలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. వాహనదారులు సూచనలు పాటించి సహకరించాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!