Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

విద్యార్థులు చదువుల్లో రాణించాలి

On: December 9, 2025 12:20 PM

విద్యార్థులు చదువుల్లో రాణించాలి

– అబాకస్ లో బిట్స్ విద్యార్థిని ప్రతిభపట్ల ఉపాధ్యాయుల హర్షం

– జోనల్ స్థాయిలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన హన్షుజ

ములుగు, డిసెంబర్ 8, తెలంగాణ జ్యోతి : విద్యార్ధులు చదువుల్లో రాణించాలని, వివిధ రకాల పోటీ పరీక్షల్లో పాల్గొనడం ద్వారా ఆత్మస్థైర్యం పెరుగుతుందని బిట్స్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గిరిగాని కవిత అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జోనల్ లెవెల్ 1 స్థాయిలో ఆదివారం నిర్వహించిన అబాకస్ పరీక్షల్లో ములుగులోని బిట్స్ ప్రైమరీ స్కూల్ విద్యార్థిని జె.హన్షుజ మొదటి స్థానంలో నిలిచింది. హన్మకొండ జిల్లా పరకాలలో జరిగిన పోటీల్లో 21పాఠశాలల విద్యార్థులు పాల్గొనగా ములుగు బిట్స్ విద్యార్థిని మొదటి స్థానంలో నిలువడం పట్ల ప్రధానోపా ధ్యాయురాలితో పాటు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కవిత మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతో పాటు ఇతర యాక్టివిటీలలో పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, దీని ద్వారా పోటీతత్వం పెరగడంతోపాటు శారీరక, మానసిక పరిపక్వత, స్నేహభావం పెంపొందుతుందన్నారు. సోమవారం పాఠశాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థిని హన్షుజకు సర్టిఫికెట్ అందజేయడంతో పాటు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అశ్విని, మానస, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!