బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
కన్నాయిగూడెం,డిసెంబర్8,తెలంగాణజ్యోతి:కన్నాయిగూడెంమండలం లోని గుర్రెవుల గ్రామంలో ఇటీవల వాసంపెళ్లి దుర్గమ్మ, వాసంపెళ్లి సమ్మక్క ఒకే రోజు మరణించడంతో శోకసంద్రంలో ఉన్న కుటుంబాలను కాంగ్రెస్ నాయకులు పరామర్శించి ఆర్ధిక సాయం అందించారు. సోమవారం కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి అంబాల సౌజన్య ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు 50 కేజీల బియ్యం సంచులు అందజేయగా, వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంగలారపు సత్యం, సీనియర్ నాయకుడు బొగ్గుల నాగేశ్వరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.






