విద్యార్థి దశ నుండే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి

On: December 5, 2025 3:28 PM

విద్యార్థి దశ నుండే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి

విద్యార్థి దశ నుండే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి

విద్యార్థుల కోసమే వైజ్ఞానిక ప్రదర్శన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

కాటారం, డిసెంబర్ 5,తెలంగాణ జ్యోతి : విద్యార్థులు కలలు కంటూ వాటి సాకారానికి నిరంతరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపు నిచ్చారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక శాంతి నికేతన్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన 53వ విద్యా, వైజ్ఞానిక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు విద్యార్థి దశ నుండే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చు కోవాలన్నారు. కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, సమాజానికి ఉపయోగపడే ఎన్నో నూతన ఆవిష్కరణలు మీ నుండి రావాలని ఆకాంక్షించారు. ఆకాశంలో ఎగిరే పక్షులను చూసే రైట్ సోదరులు విమానాన్ని తయారు చేశారని, ప్రకృతిని, పరిసరాలను గమనించడం ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని విద్యార్థులకు గుర్తుచేశారు. మానవ జీవితంలో సైన్స్ ఎంతో కీలకమని, అది మన జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని తెలిపారు. విద్యార్థులు తమ కలలను నిజం చేసుకునే దిశగా అడుగులు వేయాలని సూచించారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఆదేశానుసారం జిల్లాలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన మరియు ఇన్స్పైర్ మేళాను నిర్వహించుకుం టున్నామని, దీనికి అనుగుణంగా డిసెంబరు 5, 6 తేదీలలో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ మరియు ఇన్స్పైర్ మేళాను నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ సైన్స్ ఫెయిర్ లో 147 సైన్స్ ఫెయిర్ ప్రాజెక్టులు , 77 ఇన్స్పైర్ ప్రాజెక్టులు ప్రదర్శించడం జరిగిందని విద్యార్థులను అభినందిం చారు.ఈ కార్యక్రమం విద్యార్థుల్లో సైంటిఫిక్ టెంపర్ ను, సైంటిఫిక్ యాటి ట్యూడ్ ను పెంపొందించడానికి, భావిశాస్త్రవేత్తలుగా ఎదగడానికి దోహద పడుతుందని వివరించారు.  ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించు టకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులచే 13 సైన్స్ ఫెయిర్ నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన ఎగ్జిబిట్లను సందర్శించుటకు జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులను అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ రకాల విద్యా వైజ్ఞానిక స్టాళ్లు పరిశీలించి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిఈఓ రాజేందర్, ఎంపిడిఓ తరుణి ప్రసాద్, జిల్లా సైన్స్ అధికారి స్వామి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!