మహాదేవపూర్ సర్పంచిగా మాజీ ఎంపీపీ బి రాణి బాయ్ నామినేషన్
కాటారం, డిసెంబర్4, తెలంగాణజ్యోతి: మహాదేవపురం మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ మహాదేవపూర్ సర్పంచిగా మాజీ ఎంపీపీ బన్సోడ రాణి బాయ్ రామారావు గురువారం నామినేషన్ వేశారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు శ్రీనుబాబు ఆశీస్సులతో నామినేషన్ వేసినట్లు రాణి భాయ్ తెలిపారు.






