కన్నాయిగూడెం ఆసుపత్రిని పరిశీలించిన డీఎంహెచ్‌ఓ
సిబ్బందిపై సమయపాలన – సేవా నాణ్యత పై కఠిన హెచ్చరిక
కన్నాయిగూడెం, డిసెంబర్ 4,తెలంగాణ జ్యోతి : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. గోపాల్ రావు గురువారం సందర్శించి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, నిర్లక్ష్యం ప్రదర్శించిన పక్షంలో శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విధుల కోసం డ్యూటీ రోస్టర్‌ను కచ్చితంగా అమలు చేయాలని, రికార్డులు–రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు 100 శాతం అమలు చేయాలని సూచించారు. అనంతరం మందుల గది, ఐపీ వార్డులను పరిశీలించి రోగుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు డా. పవన్ కుమార్, డా. శ్రీకాంత్, పీఎచ్‌సీ వైద్యాధికారి డా. మధుకర్, డా. గిరిబాబు, హెల్త్ ఎడ్యుకేటర్ సుజాత, సూపర్వైజర్ రమణకుమారి, పురుష–మహిళా హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.






