Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

శ్రీదత్తాత్రేయ స్వామి దేవాలయంలో ఘనంగా హోమం పూర్ణాహుతి

On: December 4, 2025 2:39 PM

శ్రీదత్తాత్రేయ స్వామి దేవాలయంలో ఘనంగా హోమం పూర్ణాహుతి

– ముఖ్య అతిథిగా టీపిపిసిసి ఉపాధ్యక్షులు దుద్దిళ్ళ శ్రీను బాబు

కాటారం, డిసెంబర్ 04,(తెలంగాణ జ్యోతి): కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో మంత్రి శ్రీధర్ బాబు కుటుంబ సభ్యులచే నిర్మాణమైన దత్తాత్రేయ స్వామి దేవాలయంలో గురువారంతో దత్తనవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీ పి సి సి ఉపాధ్యక్షులు దుద్దిళ్ల శ్రీను బాబు, మంత్రి శ్రీధర్ బాబు మాతృమూర్తి జయమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గురువారం రోజున ఉదయం దత్తాత్రేయ స్వామి కి శ్రీదత్త,రుద్ర, అభిషేకములు, పూలతో, లక్ష తులసి అర్చన నిర్వహించారు. పంచసూక్త హోమము మహా పూర్ణాహుతి మహా ఆశీర్వచనము,తీర్థ ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీరామ్భట్ల కృష్ణమోహన్ శర్మ, సుమిత్ పండిట్, వేదాంతం గణేష్ శర్మ, ప్రవీణ్ శర్మ, నగేష్ శర్మ, పవన్ శర్మ, శ్యామ్ శర్మ వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!