భూపాలపల్లిలో ఘనంగా హోం గార్డ్ రైజింగ్ డే వేడుకలు

On: December 4, 2025 1:07 PM

భూపాలపల్లిలో ఘనంగా హోం గార్డ్ రైజింగ్ డే వేడుకలు

భూపాలపల్లిలో ఘనంగా హోం గార్డ్ రైజింగ్ డే వేడుకలు

కాటారం, డిసెంబర్ 04, తెలంగాణ జ్యోతి : 63వ హోం గార్డ్ రైజింగ్ డే వేడుకల సందర్భంగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో వనమహోత్సవం లో భాగంగా మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టారు. తరువాత హోం గార్డ్‌ల వాలీబాల్ క్రీడలను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, హోం గార్డ్‌ల కోసం నిర్వహించే ఇలాంటి క్రీడా కార్యక్రమాలు మానసిక ఉల్లాసం, జట్టు స్పూర్తి, శారీరక దృఢత్వం మరియు సేవాభావం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అలాగే విధి నిర్వహణలో శ్రద్ధ, క్రమశిక్షణ, సమన్వయం పెంపుకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని ఎస్పీ తెలిపారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!