Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

శుక్రవారం శుభముహూర్తం.. నామినేషన్లకు చివరి రోజేనని నిర్ణయం…

On: December 4, 2025 11:12 AM

శుక్రవారం శుభముహూర్తం.. నామినేషన్లకు చివరి రోజేనని నిర్ణయం…

కాటారం, డిసెంబర్ 4, తెలంగాణ జ్యోతి : భూపాలపల్లి జిల్లాలో మూడో విడతలో కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, మలహార్ మండలాల్లో 81 గ్రామ పంచాయతీలు, 696 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్లు మొదటి రోజున స్వల్పంగానే వచ్చాయి. ఆటారం మండలంలో 34 సర్పంచ్ కోసం 68 వార్డులకు, మహాదేవపూర్ మండలంలో 20 సర్పంచుకు 41 వార్డులకు, మలహర్ మండలంలో 30 సర్పంచుకు, 47 వార్డులకు, మహదేవపూర్ మండలంలో సర్పంచ్ పదవి కోసం 22 , వార్డులకు 19 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు ఇచ్చారు. గురువారం రెండవ రోజు మా అమ్మ మాత్రమే వచ్చే అవకాశం ఉంది. నామినేషన్ల వారం చివరి రోజు పోవడం మంచి ముహూర్తం ఉండడంతో ఎక్కువమంది అదే రోజున నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. కాటారం మేజర్ గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపిటిసి జాడి మహేశ్వరి శుక్రవారం నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. నామినేషన్ వేసేందుకు ముందుగానే కాటారం గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాజీ ఎంపీపీ మార్కెట్ కమిటీ చైర్మన్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధుల సహాయంతో ఆధ్వర్యంలోనే నామినేషన్ వేస్తానని సర్పంచ్ అభ్యర్థిని జాడి మహేశ్వరి తెలిపారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!