నేటి నుండే మూడో విడత నామినేషన్ల స్వీకరణ

On: December 3, 2025 11:48 AM

నేటి నుండే మూడో విడత నామినేషన్ల స్వీకరణ

నేటి నుండే మూడో విడత నామినేషన్ల స్వీకరణ

కాటారం, డిసెంబర్ 3, తెలంగాణ జ్యోతి: భూపాలపల్లి జిల్లాలో మూడో విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. కాటారం మండలంలో 24 పంచాయతీలు, 210 వార్డులకు 9 క్లస్టర్లు, మహాదేవపూర్ మండలంలో 18 పంచాయితీలు, 162 వార్డులు, 5 క్లస్టర్లు, మలహర్ మండలంలో 15 పంచాయతీలు 128 వార్డులు 5 క్లస్టర్లు, మహాముత్తారంమండలంలో 24 పంచాయతీలు, 196 వార్డులు 6 క్లస్టర్లు లను ఏర్పాటు చేశారు. నామినేషన్ అభ్యర్థులకు సహాయకంగా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు.

రెండో విడత లో నామినేషన్ల పరిశీలన

జిల్లాలోని రెండో విడత లో చిట్యాల, టేకుమట్ల, భూపాలపల్లి, పలిమెల మండలాల్లో 85 గ్రామ పంచాయతీ లలో 694 వార్డులకుఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మండలాల్లో నామినేషన్ల పర్వం మంగళవారంతో ముగిసింది. బుధవారం నామినేషన్లను పరిశీలించిన అనంతరం సాయంత్రం 5 గంటలకు చెల్లుబాటైన నామినేటెడ్ అభ్యర్థుల జాబితాను రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు.

మొదటి దశలో అభ్యర్థులకు గుర్తులు ప్రకటన

భూపాలపల్లి జిల్లాలోని మొదటి విడతలో ఎన్నికలు జరిగే గణపురం, రేగొండ,కొత్తపల్లి గోరి, మొగుళ్ల పెళ్లి మండలాల్లో బుధవారం సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల జాబితా గుర్తులను రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. సాయంత్రం నుండి అభ్యర్థులు గుర్తులతో తమ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. మొదటి దశ ఎన్నికలు 82 పంచాయితీలు 712 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. 11 వ తేదీన ఈ పంచాయతీలకు పోలింగ్ నిర్వహిస్తారు మధ్యాహ్నం అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి ఓట్లు లెక్కింపు చేసి విద్యార్థులను ప్రకటిస్తారు గెలిచిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలను రిటర్నింగ్ అధికారులు ఇస్తారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!