Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

Mulugu | ములుగు జిల్లాలో 3 విడుతలుగా పంచాయతీల ఎన్నికలు

On: November 26, 2025 11:17 AM

Mulugu | ములుగు జిల్లాలో 3 విడుతలుగా పంచాయతీల ఎన్నికలు

Mulugu | ములుగు జిల్లాలో 3 విడుతలుగా పంచాయతీల ఎన్నికలు

ములుగు, నవంబర్ 25,తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లాలో మొత్తం 9 మండలాలు, 146 గ్రామ పంచాయతీలు ఉండగా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు నిర్ణయించారు. మొదటి విడతలో డిసెబర్​ 11న 48 గ్రామ పంచాయతీలు, 420 వార్డుల్లో ఎన్నికలు జరగనుండగా తాడ్వాయి మండలంలో 18, ఏటూరునాగారం మండలంలో 12, గోవిందరావుపేట మండలంలో 18 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో విడతలో డిసెంబర్​ 14న 52 గ్రామ పంచాయతీలు, 462 వార్డుల్లో ఎన్నికలకు గాను మల్లంపల్లి మండలంలో 10, ములుగులో 19, వెంకటాపూర్ లో 23 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు కొనసాగనున్నాయి. మూడో విడతలో డిసెంబర్​ 17న 46 గ్రామ పంచాయతీలు, 408 వార్డుల్లో పోలింగ్ జరగనుండగా వెంకటాపురం మండలంలో 18, వాజేడులో 17, కన్నాయిగూడెం మండలంలో 11 గ్రామ పంచాయతీలలో పోలింగ్ జరగనుంది. మొత్తం మూడు విడతల్లో జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. కాగా, ఎన్నికలు మధ్యాహ్నం వరకే జరుగనుండగా ఫలితాలు సాయంత్రం వరకు బయటకు రానున్నాయి.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!