Mulugu  | ములుగు జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

On: November 26, 2025 7:41 AM

Mulugu  | ములుగు జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Mulugu  | ములుగు జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

– 40 ఎకరాల్లో నిర్మాణానికి ఆమోదం

ములుగు, నవంబర్ 25, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లాలో ఎంతో కాలంగా క్రీడాకారులు ఆశగా ఎదురు చూస్తున్న స్పోర్ట్స్ స్కూల్‌కు రాష్ట్ర కేబినెట్ అధికారిక ముద్ర వేసింది. మొత్తం 40 ఎకరాల భూభాగం కేటాయింపునకు కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ వ్యవహారం త్వరితగతిన పురోగమించింది. ఈ నిర్ణయంతో కాంగ్రెస్ శ్రేణులతోపాటు జిల్లా ప్రజా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ములుగు మండలం జగ్గన్నపేట శివారులోని సర్వే నం. 443/1లో స్థలాన్ని రెవెన్యూ అధికారులు పరిశీలించి, స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వానికి విశద నివేదిక సమర్పించారు. ఏజెన్సీ మండలాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులు ఏ కొదువ లేకున్నా, సమగ్ర శిక్షణా వసతులు లేకపోవడం ఇబ్బందిగా మారిన నేపథ్యంలో, ఈ స్కూల్ ఏర్పాటుతో వారి ప్రతిభ జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి దోహదం చేయనుంది. అధికార వర్గాల ప్రకారం, త్వరలో నిర్మాణానికి సంబంధించిన డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డి పి ఆర్) సిద్ధం చేయబడనుంది.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!