జాతీయ స్థాయి కబడ్డీ జట్టుకు ఎంపికైన  క్రీడాకారుడు గోగు శేషు

On: November 25, 2025 5:06 PM

జాతీయ స్థాయి కబడ్డీ జట్టుకు ఎంపికైన  క్రీడాకారుడు గోగు శేషు

జాతీయ స్థాయి కబడ్డీ జట్టుకు ఎంపికైన  క్రీడాకారుడు గోగు శేషు

వెంకటాపూర్, నవంబర్ 25, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌కు చెందిన యువ కబడ్డీ క్రీడాకారుడు గోగు శేషు జాతీయ స్థాయి జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నెల 27 నుంచి 30 వరకు హర్యానా రాష్ట్రం సోనిపట్‌లో జరుగనున్న 35వ జాతీయ జూనియర్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో ఆయన తెలంగాణ తరఫున పాల్గొననున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్, కార్యదర్శి జనార్దన్ తెలిపారు. గత సెప్టెంబర్‌లో నిజామాబాదు జిల్లా ముప్కాల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు వచ్చిన ఈ అవకాశంపై ములుగు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అభినందనలు తెలియజేసింది. వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందిన గోగు రాజయ్య, స్వరూపల కుమారుడు గోగు శేషు జాతీయ స్థాయికి ఎంపిక కావడంతో గ్రామ కబడ్డీ క్రీడాకారులు, గ్రామస్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!