చిన్న బోయినపల్లిలో ఇందిరమ్మ చీరల పంపిణీ 

On: November 25, 2025 4:56 PM

చిన్న బోయినపల్లిలో ఇందిరమ్మ చీరల పంపిణీ 

చిన్న బోయినపల్లిలో ఇందిరమ్మ చీరల పంపిణీ 

ఏటూరునాగారం, నవంబర్ 25, తెలంగాణ జ్యోతి : మండలం లోని చిన్న బోయినపల్లి గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ మహిళలకు చీరలు అందజేయడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వంలో మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత పట్ల మహిళలు ప్రత్యేకంగా ఆనందం తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను మహిళలు అభినందించారు. గ్రామ మహిళలు, గ్రామస్తుల తరఫున ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సీతక్కకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఎస్టీ సెల్ అధ్యక్షుడు చేలు వినయ్, చిన్నబోయినపల్లి కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు బుసాని నరేష్, కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు గంట కృష్ణ (ఠాగూర్), మాజీ ఉప సర్పంచ్ కుంభం రాజేష్, నీలం శ్రీనివాస్, శేఖర్, ఎస్కే మోగులన్, ఎస్కే ఇస్మాయిల్, ఎస్కే మైబెల్లి, పి. సురేష్‌తో పాటు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!