పేదల పక్షాన కాంగ్రెస్ – నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

On: November 22, 2025 3:54 PM

పేదల పక్షాన కాంగ్రెస్ – నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

పేదల పక్షాన కాంగ్రెస్ – నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

ఏటూరునాగారం, నవంబర్ 22, తెలంగాణ జ్యోతి : పేదలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వ అండదండలతో నిలబడేలా పార్టీ పని చేస్తోందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిటమట రఘు తెలిపారు. మంత్రి సీతక్క ఆదేశాలు, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనల మేరకు ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన జనగాం బుచ్చయ్య దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించి, పార్టీ తరఫున 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈర్సవడ్ల వెంకన్న, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య, టౌన్ అధ్యక్షుడు ఎండీ సులేమాన్, నాయకులు ఉమ్మనేని రమేష్, గంపల శివకుమార్, మామిడి రాంబాబు, కందుకూరి రతన్, పడిదల హన్మంత్, కొండగొర్ల రాంబాబు, సునారికాని శ్రీను, జనగాం సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!