Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

On: November 20, 2025 2:25 PM

ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

వెంకటాపురం, నవంబర్ 20 (తెలంగాణ జ్యోతి): ఈనెల 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర ఓడబలిజ సేవాసంఘం అధ్యక్షులు డర్ర దామోదర్ బలిజ సభ్యులకు పిలుపునిచ్చారు. ములుగు జిల్లా వెంకటాపురం లో సంఘం ముఖ్యనాయకులు, సభ్యులతో సమావేశం నిర్వహించి, ప్రతి ప్రాంతంలో కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టాలని సూచించారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు తమ తమ ప్రాంతాల్లో వాడ బలిజ సేవా సంఘం జెండాలను ఎగురవేయాలని రాష్ట్ర కమిటీ సూచిస్తున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లా, మండల, గ్రామంలో జెండాలు ఎగురవేసి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు. అదే విధంగా ఐక్యంగా ఉండి ప్రభుత్వ పరమైన హక్కులు సాధించుకోవడంతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వాడ బలిజలకు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వాడ బలిజ సేవా సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు తోట మల్లికార్జున రావు, మండల నాయకులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!