ములుగు మార్కెట్ యార్డ్ ఎదుట రోడ్డు ప్రమాదం

On: November 18, 2025 12:02 PM

ములుగు మార్కెట్ యార్డ్ ఎదుట రోడ్డు ప్రమాదం

ములుగు మార్కెట్ యార్డ్ ఎదుట రోడ్డు ప్రమాదం

ములుగు, నవంబర్ 18, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కేంద్రంలోని ప్రేమ్‌నగర్ సమీపంలో ఉన్న మార్కెట్ యార్డ్ ముందు సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం…. హనుమకొండ నుంచి ములుగు వైపు వస్తున్న లారీని వెనుక నుంచి కంకర లోడ్‌తో వస్తున్న టిప్పర్ మార్కెట్ యార్డు ముందు ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఢీకొనడంతో టిప్పర్ క్యాబిన్ తీవ్రంగా దెబ్బతింది. డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో అక్కడికక్కడే అప్రమత్తమైన స్థానికులు అతడిని బయటకు తీశారు. అనంతరం 108 అంబులెన్స్ ద్వారా ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఎంజిఎంకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!