ఘనంగా బంజారా తీజ్ పండుగ వేడుకలు
– వేడుకల్లో పాల్గొన్న టిఆర్ఎస్ ములుగు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్య జంపన్న
– ఏటూర్ నాగారం ఎస్సై తాజుద్దీన్
తెలంగాణజ్యోతి, ఏటూరునాగారం : మండలంలోని దొడ్ల కొత్తూరు గ్రామంలో లంబాడి సాంస్కృతి పండుగలో ఒకటైన తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. తీజ్ ఉత్సవాలకు ముఖ్యఅతిథిలుగా టిఆర్ఎస్ ములుగు జిల్లా వర్కింగ్ ప్రెసి డెంట్ భూక్య జంపన్న, ఏటూర్ నాగారం ఎస్సై తాజుద్దీన్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జంపన్న మాట్లాడుతూ తీజ్ పండుగ అంటే లంబాడి జాతికి గొప్ప పండుగని, నవధాన్యా లను తొమ్మిది రోజులు బుట్టలలో నాటి బంజారా సోదరీమ ణులు 9 రోజులు ఉపవాసాలు ఉండి 9 రోజుల తర్వాత శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ కి, మేరమ్మ యాడి దేవతలకు సమర్పించి, నవధాన్యాల మొక్కల మాదిరిగానే తమ కుటుం బాలు పచ్చగా ఉండాలని వేడుకొని బంజారా దేవతలకు సమర్పించడం జరుగుతుందన్నారు.తెలంగాణ సాంస్కృతి చాలా గొప్పదని నేడు బతుకమ్మ పండుగ, తీజ్ పండుగ ఒకేరోజు రావడం శుభసుచకమని, అందరు ఎలాంటి ఇబ్బం దులు లేకుండా ఆనందంగా జరుపుకోవాలని ఏటూరునా గారం ఎస్సై తాజుద్దీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సేవా లాల్ సేన ములుగు జిల్లా కార్యదర్శి భూక్య రాజేష్. మండల అధ్యక్షులు ఇస్లావత్ కుమార్. మండల ప్రధాన కార్యదర్శి నున్సవత్ కమలేష్.కోశాధికారి ఇస్లావత్ లక్ష్మణ్. గ్రామ కమి టీ అధ్యక్షులు భూక్య చందులాల్. మండల సలహాదారుడు అజ్మీర శంకర్ నాయక్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.