యాకన్నగూడెం వద్ద విస్తృతంగా వాహనాల తనిఖీలు
వెంకటాపురంనూగూరు, తెలంగాణజ్యోతి : వెంకటాపురం చర్ల ప్రధాన రహదారి ములుగు జిల్లా యాకన్నగూడెం వద్ద శుక్రవారం వెంకటాపురం పోలీసుల ఆధ్వర్యంలో విస్తృ తంగా వాహనాల తనిఖీల కార్యక్రమాన్ని నిర్వహించారు. మావోయి స్టు వారోత్సవాల సందర్భంగా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని, పేరూరు, వాజేడు, వెంకటాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో రెడ్ అలర్ట్ అమల్లో ఉంది. మావోయిస్టుల కవ్వింపు చర్యలను పకడ్బందీ వ్యూహంతో, పతిష్టమైన భద్రతతో తిప్పికొట్టేందుకు అదనపు పోలీస్ బలగాలు సరిహద్దు అటవీ ప్రాంతంలో జల్లడ పడుతున్నాయి. ప్రధాన రహదారిపై వచ్చే పోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని రాబడుతు న్నారు. ఈ మేరకు యాకన్నగూడెం వద్ద వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కుమార్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీల కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపు రం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కే. తిరుపతిరావు, సివిల్, సిఆర్పి ఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.