ఫారెస్ట్ అధికారులపై జరిగిన దాడిని ఖండించిన ఏ ఎన్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి

Written by telangana jyothi

Published on:

ఫారెస్ట్ అధికారులపై జరిగిన దాడిని ఖండించిన ఏ ఎన్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి

– వలస గిరిజనేతరుల నుండి రక్షణ కలిపించాలి

– నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్.

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ఆదివాసీల పైన జరిగే దాడులకు ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణమని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొరసా నరసింహ మూర్తి ఆరోపించారు.  తాడ్వాయి మండలం లోని దామర వాయి అడవుల్లో విధుల్లో ఉన్న ఫారెస్ట్ అధికారి పైన గిరిజ నేతరుడు దాడి చేయడాన్ని నర్సింహా మూర్తి తీవ్రంగా ఖండిం చారు.ఆదివాసీల పైన దాడులు నిత్య కృత్యం అవుతున్నా యన్నారు. అర్ధరాత్రి భారీ యంత్రాలతో దట్టమైన అడవులను తొలిగిస్తూ ఉండగా అడ్డు వచ్చిన సోలం శరత్ పైన ఇనుప రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేసిన సూరజ్ రెడ్డి ని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విధి నిర్వహణ లో దుండగుల చేత అత్యంత దారుణంగా దాడి చేయబడిన సోలం శరత్ కి మెరుగైన చికిత్స అందించాలని అన్నారు. ప్రభుత్వం దోషిని శిక్షించడం లో చిత్త శుద్ధితో వ్యవహరించాలని కోరారు. సూరజ్ రెడ్డి ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినప్పటికి రెవిన్యూ అధికారులు ఎందుకు అతని పైన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిం చారు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం లో ఆదివాసీ మహిళల పైన దాడులు పెరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలోని ఆదివాసీలకు కనీస రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసీ ఉద్యోగి పైన జరిగిన దాడికి ప్రభుత్వం బాధ్యత వహించాలి అని అన్నారు. రాష్ట్రం లోని ఆదివాసీల పైన జరిగే వరుస దాడులకు ప్రభుత్వ ఉదాసీనత వైఖరే ప్రధాన కారణం అన్నారు. ఇది ఆదివాసీ సమాజం పైన జరిగిన దాడి గా అభివర్ణించారు. వలస నిరోధక చట్టానికి విరుద్ధంగా షెడ్యూల్డ్ ప్రాంతాల్లోకి వచ్చిన వలస వాదులను తక్షణమే మైదాన ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. వలస వాదుల కారణంగా ఆదివాసీల సంస్కృతి, సాంప్ర దా యాలు విచ్చిన్నం అవుతున్నాయని, గిరిజన ప్రాంత సంపద మొత్తం కొల్లగొడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now