మంత్రి సీతక్క సహకారంతోనే ములుగు జిల్లా అభివృద్ధి సాధ్యం
– ఏటూరు నాగారం లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు అభినందనీయం
జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి
తెలంగాణజ్యోతి, మంగపేట: రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీ ణ అభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సహకారంతోనే ములుగు జిల్లా అభివృద్ధి సాధ్యమని జాతీ య మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ రాష్ట్ర కాంగ్రెస్ నాయ కుడు నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ ఏటూరునాగారంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తూ 35 మంది అగ్నిమాపక సిబ్బందిని మంజూరు చేయడం, ములుగు జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీకి 433 మంది సిబ్బందిని మంజూరు చేస్తూ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం పట్ల సాంబశివరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఏటూరునాగారం లో అగ్ని మాపక కేంద్రం ఎన్నో దశాబ్దాల కల అని అది నేడు మంత్రి సీతక్క సహకారంతో ఆచరణలో సాధ్యమైందని వెనుకబడిన ములుగు జిల్లాకి మెడికల్ కళా శాల ఏర్పాటు పూర్తి స్థాయిలో సిబ్బంది మంజూరు చేసి జిల్లా అభివృద్ధిపై మంత్రి సీతక్క తనదైన చెరగని ముద్ర వేశారని సాంబశివరెడ్డి సీతక్క సేవలను కొనియాడారు. ములుగు జిల్లా అభివృద్ధికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి అను ముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, క్యాబినెట్ మంత్రులకు, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, మరియు అధికారులకు ప్రభుత్వానికి ములుగు జిల్లా ప్రజల తరపున మరియు కాంగ్రెస్ పార్టీ తరఫున సాంబశివరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి సీతక్క చొరవతో త్వరలోనే ఏటూరునాగారం కేంద్రంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాల సెంటర్ బస్ డిపో మంగపేట మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం పనులు ప్రారంభం అవుతాయని సాంబశివరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.