అక్రమంగా నిల్వ చేసిన టేకు కలప పట్టివేత
– రూ.3 లక్షల విలువగా అధికారుల వెల్లడి
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం జంపన్న వాగు కరకట్ట వద్ద అక్ర మంగా నిలువ చేసిన సుమారు రూ. 3 లక్షల విలువ చేసే టేకు కలపను అటవీశాఖ అధికారులు శనివారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. ఏటూరునాగారం అటవీశాఖ రేంజ్ అధికా రి అబ్దుల్ రెహమాన్ కథనం ప్రకారం గత కొంత కాలం గా ఏటూరునాగారం జంపన్న వాగు కరకట్ట వద్ద టేకు కలప ను అక్రమంగా నిలువ చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం ఉదయం తనిఖీలు నిర్వహించగా రూ.3 లక్షలు విలువైన 12 టేకు కలప దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకొని అటవీశాఖ డిపోకు తరలించినట్లు తెలిపారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అటవీ శాఖ రేంజ్ అధికారి తెలిపారు.