మంథనిలో సాఫ్ట్ వేర్ కంపెనీని ప్రారంభించనున్న మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: మంథని టౌన్ లో గోదావరిఖని రోడ్డు మార్గంలో గల గీట్లస్ హబ్ వద్ద రేపు శని వారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ వారి సెంటిలియాన్ నెట్ వర్క్స్ ప్రైవేటు లిమిటెడ్ నూతన సాఫ్ట్ వేర్ కంపెనీ బ్రాంచ్ ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయ నున్నారు. ఈ కార్యక్రమానికి మంథని నియోజకవర్గం లోని ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొననున్నారు.