ఆలుబాక విద్యుత్ సబ్ ష్టషన్ పరిధిలో రేపు అంత రాయం
– వినియోగదారులు సహకరించాలి – ఏ డి ఆకిటీ స్వామిరెడ్డి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం అలుబాక సబ్ స్టేషన్ పరిధి లోని అన్ని గ్రామాల వినియోగదారుల కు రేపు శని వారం 14 వ తేది ఉదయము 09 గంటల నుండి 11 గంటల వరకు సబ్ స్టేషన్ నందు మరమ్మతుల నిమిత్తము విద్యుత్ సరఫరా నిలిపి వేయటం జరుతుందని వెంకటాపురం విద్యుత్ శాఖ ఏడిఈ ఆకిటి స్వామి రెడ్డి ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు సహకరించగలరని ఆ ప్రకటనలో వినియో గదారులకు విజ్ఞప్తి చేశారు.