ఆచూకీ లేని రైతు బంధు
– బి ఆర్ ఎస్ నేతల ఆక్షేపణ
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: రైతులకు పెట్టుబడి సాయం, రైతుబందు, రైతు భరోసా ఆచూకీ లేకుండా పోయిం దని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఇన్చార్జి జోడు శ్రీనివాస్, రామి ల్ల కిరణ్, జక్కుశ్రావణ్ లు అన్నారు. రుణమాఫీ ఈ ఏడాది వానాకాలం పంట ముగింపు దశకు వస్తున్నప్పటికి కూడా, ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఆచరణలోకి రాలే దన్నారు. గత ప్రభుత్వం అమలు చేసినటువంటి రైతు బంధు ను రైతు భరోసాగా ఇస్తామని బూటకపు హామీలు ఇచ్చి, ఒక్క పక్క పంట కోత దశకు వచ్చిన కూడా, ప్రస్తుత ప్రభుత్వం ఇస్తానన్న ఎకరానికి 15 వెల్ రూపాయలు, రైతు భరోసా పథకం ఎక్కడ, దాని విధానాలు ఏమిటి అని ప్రశ్నించారు. వారు హామీ ఇచ్చిన ప్రకారం రైతు భరోసా ఇవ్వకపోయినా.. గత ప్రభుత్వం పెట్టుబడి సహాయంగా ఆగస్టు చివరి వరకు అయినా అందించినటువంటి ఒకసంవత్సరానికి ఎకరాకు 10 వేల రూపాయలు చొప్పున ఇచ్చిన ఆ రైతు బంధునైన వెంట నే రైతుల ఖాతాల్లో జమ చేయవలసినదిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తా మని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ లోపు వారికి వివిధ రకాల నిబంధనలను పెట్టి రుణమాఫీ కాకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించారు. రైతు రుణ మాఫీలో బాధితులుగా బీద, మధ్య తరగతి, అణగారిన ప్రజలే అధికం, బీదలు రుణమాఫీ పథకాన్ని నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే 2 లక్షల లోపు మొండి బకాయలు ఉన్నవారికి కుటుంబ యజమాని (రుణ గ్రస్తుడు) భర్త చనిపోయిన వారికి, వారి కుటుంబాలకు నిబంధనల పేరు మీద రుణమాఫీ చేయకపోవడం చాలా బాధాకరం, వెంటనే వారికి రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. అర్హులైన రెండు లక్షల పైబడిన రుణ బకాయిలు కలిగిన వారికి ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి విధివిధానాలను ఖరారు చేయలేదని, మండల స్థాయి ప్రభుత్వ వ్యవసాయ అధికారులు తెలిపారని నాయకులు పేర్కొన్నారు. రెండు లక్షల పైబడిన రైతులకు ఎప్పుడు రుణమాఫీ చేస్తారు, దాని యొక్క విధివిధానాలు ఏంటో వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేయాలని వారు కోరారు. అలాగే, ఏ నెలలో ఏ తారీకు వరకు 2 లక్షల పైబడిన వారికి రుణమాఫీ చేస్తారో, వెంటనే రైతులకు తెలియజేయాలని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ పార్టీ పక్షాన బిఆర్ఎస్ పార్టీ మండల శాఖజోడు శ్రీనివాస్, రామిల్ల కిరణ్ , జక్కుశ్రావణ్ డిమాండ్ చేశారు.