బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : ములుగు నియోజక వర్గ బిఅరెస్ పార్టీ ఇంచార్జ్ బడే నాగజ్యోతక్క పిలుపు మేరకు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ నిరసనలు, ధర్నాలు చేస్తారని పోలీసులు బీఆర్ఎస్ నాయ కులను ముందస్తు అరెస్ట్ చేశారు. అరెస్టుకు నిరసనకు దిగు తారనే ఉద్దేశంతో ముందస్తుగా పోలీసులు బుధవారం రాత్రి నుంచి గాలింపు చర్యలు చేపట్టి బిఆర్ఎస్ నాయకులు ఇంట్లో నుంచి తీసుకెళ్లి ముందస్తు అరెస్టులు చేశారు. పోలీసు లు ముందస్తు అరెస్టు చేసిన వారిలో మండల పార్టీ అధ్య క్షులు సుబ్బల సమ్మయ్య, మాజీ సర్పంచ్ దుర్గం నారాయణ, మండల సీనియర్ నాయకులు పూజారి కిషోర్, మఠం వెంకటేష్,జగన్, లక్ష్మణ్, సురేష్ ప్రవీణ్ తదితరులను స్థానిక ఎస్సై వెంకటేష్, ఆధ్వర్యంలో ముందస్తుగా అరెస్టు చేశారు. బిఅరెస్ పార్టీ మండల అధ్యక్షులు మాట్లాడుతూ.. అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని, అరెస్ట్ లు బిఆర్ ఎస్ పార్టీకి కొత్తకాదని, మీరెంత అణిచివేయలని చూసిన ఉప్పన లా లేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన,దుర్మార్గాలను, మోసాలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతామని హెచ్చరించారు.