ఏజెన్సీ చట్టాలను అమలు చేయాలని కలెక్టర్ కు వినతి

Written by telangana jyothi

Published on:

ఏజెన్సీ చట్టాలను అమలు చేయాలని కలెక్టర్ కు వినతి

– ఏ ఎన్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి

– మన్యం లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజన చట్టాల అమల్లో అధికారులు తీవ్ర అలసత్వం వహిస్తున్నారని ఏ ఎన్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి కలెక్టర్ దివాకర టి ఎస్ కు  గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేశారు. ఏజెన్సీ ప్రాంత మండలాల్లో పని చేసే రెవిన్యూ, పంచాయతీ అధికారుల్లో జవాబు దారి తనం లేదన్నారు. కలెక్టర్ కు అందజేసిన వినతిపత్రం వివరాలను ములుగు జిల్లా వెంకటాపురంలో సోమవారం సాయంత్రం మీడియాకు విడుదల చేశారు. వలస గిరిజనేతరులు గ్రామ కంఠం భూముల్లో బహుళ అంతస్తులు భవనాలు నిర్మిస్తు న్నారని అన్నారు. ఎల్ టి ఆర్ చట్టానికి విరుద్ధంగా గిరిజనే తరులు భూముల క్రయ, విక్రయాలు చేస్తున్నారని అని వినతిపత్రం లో పేర్కొన్నారు. తహసీల్దార్ లకు ఎన్ని సార్లు చెప్పిన పట్టించు కోవడం లేదని అన్నారు. ఏజెన్సీ చట్టాల పైన గౌరవ, మర్యాద లేదని అధికారుల వల న ఆదివాసీలకు నష్టం జరుగుతోందని అన్నారు. ప్రత్యేక స్వయం ప్రతి పత్తి కలిగిన షెడ్యూల్డ్ ప్రాంతాలను అధికారుల తీరుతో ప్రశ్న్తార్ధకంగా మారి పోతున్నాయని, కలెక్టర్ దివాకర టి ఎస్ కు వివరించారు. గిరిజన ప్రాంతాల్లో కనపడే అభివృద్ధి గిరిజ నులది కాదని, అది వలస గిరిజనేతరులది అని తెలిపారు. ఆదివాసీల అభివృద్ధి ఆనవాలు ఏజెన్సీ లో ఎక్కడ లేదన్నారు. ఐటీడీఏ చైర్మన్ గా ఆదివాసీల అభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. మన్యం లో మలేరియా, డెంగ్యూ, టైపాయిడ్, వైరల్ ఫీవర్ లు ప్రభలు తున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వందల సంఖ్యలో జ్వరాలు కేసులు నమోదు అవుతున్నాయని అన్నారు. స్థానిక పి హెచ్ సి లల్లో రోగులకు బెడ్స్ సరిపోవడం లేదని అన్నారు. ప్రత్యేక వైద్య బృందాలతో గిరిజన గ్రామాల్లో వైద్య సేవలు అందించాలని కోరడం జరిగింది. మన్యం లో విష జ్వరాల కారణంగా మరణాల సంభవిస్తున్నాయని తెలిపారు. అత్య వసర ఆరోగ్య పరిస్థితి కల్పించి మన్యం వాసులను కాపాడా లన్నారు. ఏజెన్సీ విద్య పైన ప్రత్యేక దృష్టి పెట్టక పోతే అడవి బిడ్డలు విద్యకు దూరం అయ్యే ప్రమాదం ఉందన్నారు. సీ.ఎం. గిరివికాస్ పథకం ద్వారా వేసిన బోర్లకు విద్యుత్తు సౌకర్యం కల్పించక పోవడం తో ఆదివాసీ అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. అన్ని సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని కలెక్టర్ దివాకరా టి ఎస్ హామీ ఇచ్చినట్లు ఏఎన్ఎస్ నేత నర్సింహా మూర్తి తెలిపారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now