కాటారంలో గంజాయి మూఠా అరెస్ట్
– ఏడుగురు వ్యక్తులతో పాటు, 1.8 కిలోల గంజా స్వాధీనం
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : నిషేధిత గంజాయి రవాణాకు పాల్పడుతున్న ముఠాను కాటారం పోలీసులు పట్టుకున్నారు. గురువారం కాటారం పోలీస్ స్టేషన్ లో ఇంచార్జీ సర్కిల్ ఇన్ స్పెక్టర్ రామచందర్ రావు వివరాలను వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం కాటారo పోలీసులకు అందిన నమ్మదగిన సమాచారం.. కొందరు వ్యక్తులు అక్రమంగా నిషేధిత గంజాయి రవాణా చేస్తున్నట్టు సమాచారం రాగా కాటారo సబ్ ఇన్ స్పెక్టర్ మ్యాక అభినవ్ సిబ్బందితో కాటారం మండలం లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు సమీపంలో ఆదివారం పేట మూల దగ్గర మాటు వేసి వుండగా ఈ నేరస్తులు పట్టుబడ్డారని వివరిం చారు. కాటారం కు చెందిన దుర్గం నంద కిషోర్, బయ్యారం కు చెందిన జగజంప్పుల విష్ణు, కొత్తపల్లికి చెందిన పెద్ది నిఖిల్ రాజ్, కాటారంకు చెందిన కడారి కార్తీక్, మారుపాక రిశ్వంత్, మెరిజాల రోహిత్, ఎర్రగుంటపల్లికు చెందిన జక్కు రాజేష్ లు దుర్గం నంద కిషోర్ తన వెంట తెచ్చిన నిషేధిత గంజాయి ఇస్తుండంగా కాటారం పోలీస్ బృందం చాకచక్యంగా పట్టుకు న్నారు. నిందితుల నుండి 1.8 కేజీల నిషేధిత గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత గంజాయిని భూపాలపల్లికి చెందిన లావుడ్య సిద్దు అనే వ్యక్తికి 36 వేల రూపాయలను ఇచ్చి 1.8 కేజీల గంజాయి తీసుకున్నట్లు దుర్గం నంద కిషోర్ విచారణలో ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. అనంతరం సదరు నిందితులను కస్టడీ లోకి తీసుకొని చట్ట రీత్యా వారిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించామని సీ ఐ రామచందర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటారం ఎస్ ఐ అభినవ్ తో పాటు కానిస్టే బుల్స్ లక్మిరాజం, హరికుమార్, జంపన్న, సాంబశివరావు, లవన్, నరేష్, హోంగార్డు తిరుపతి పాల్గొన్నారు. యువత గంజాయి విక్రయాలు, రవాణా లాంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఇంచార్జీ సీఐ రాంచందర్ రావు, ఎస్ ఐ మ్యాక అభినవ్ తెలిపారు. యువ త గంజాయికి దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల నడవడిక పై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని సూచిం చారు. యువత గొడవల జోలికి వెల్లి, అనవసరంగా కేసుల పాలై, జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహారిస్తే, కేసులతో పాటు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని హెచ్చరించారు.