చుట్ట పొగాకు సాగుకోసం కంపెనీల సమావేశం..!
– వెంకటాపురం మండల కేంద్రంలోని ఏఎంసి గోదాంలో రైతులతో సమావేశం.
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం కేంద్రంలో బుధవారం లంక పొగాకు సాగు చేసేందుకు రైతులతో కొన్ని కంపెనీల ఏజెంట్లు స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాం ఆవరణలో రైతులతో సమావేశం నిర్వహించారు. అయితే వెంకటాపురం మండల కేంద్రంకు చెందిన ఒక ప్రముఖ ఎరువులు పురుగు మందుల షాప్ యజమాని, ప్రధాన ఏజెంట్ గా,నాటు పొగాకు సాగుకు రైతులను సమాయత్తం చేసే విధంగా ముందుగానే ఏజెంట్ తో నజరాన మాట్లాడు కుని, బుధవారం సాయంత్రం స్థానిక వ్యవసాయ మార్కెట్ గోదాం లో రైతుల తో సమావేశం నిర్వహించారు. అయితే పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం, మరియు గుట్కా ఇతర టుబాకో ఉత్పత్తులు నమలటం వలన, నోటి క్యాన్సర్ ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిం ది. ఈ మేరకు పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై తేలు బొమ్మతో పాటు,నోటి క్యాన్సర్ కు సంబంధించిన ఫోటోలను సంక్షిప్తంగా ప్రచురించే విధంగా ఆదేశాలు జారీ చేసి అమలు చేశారు. అలాగే దశాబ్దాల క్రితం కేంద్ర ప్రభుత్వం టుబాకో బోర్డు ఏర్పాటు చేసి, వర్జినియా పొగాకు పండించేందుకు ఆయా రైతుల విస్తీర్ణ నమోదు చేసి, ప్రభుత్వ చట్టాల ప్రకారం సాగు విస్తీర్ణం, బ్యారన్లలో క్యూరింగ్ , ప్రబుత్వ వేలం కేంద్రం లో విక్రయాలు ప్రభుత్వం అనుమతులతో టొబాకో బోర్డు రిజిస్ట్రేషన్ చేసేది. సాగు ను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న టుబాకు బోర్డు మూడు దశాబ్దాల క్రితమే క్రమబద్ధీకరణ చేయడంతో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో టుబాకో బోర్డ్ వర్జినీయ పొగాకు సాగు ను జీరో స్థాయికి తగ్గిపోయింది. అయితే నాటు లంక పొగాకు సాగును ప్రోత్సహించేందుకు, ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేక పోయిన మారు మూల ప్రాంతమైన వెంకటాపురం, వాజేడు మండలంలో కొంతమంది ఆంధ్ర ప్రాంత దళారులు స్థానికంగా ఉండే కొంతమందిని, ఆర్థిక పరమైన వలలు చూపించి, రైతులను మభ్యపెట్టి , చూపించి, లంక పొగాకు సాగు ను ప్రోత్సహించే విధంగా బుధవారం వెంకటాపురంలో సమావేశం నిర్వహిం చారు. లంక పొగాకు విత్తనాలు తామే సరఫరా చేస్తామని, నాటిన తర్వాత ఎరువులు, పురుగు మందులు పెట్టుబడి సహాయం తామే అందిస్తామని, తదుపరి గరిసె లెక్కన కొనుగోలు చేసి నగదు చెల్లిస్తామని, ఆంధ్ర ప్రాంత బడా వ్యాపారులు రైతులకు విన్నవించారు. అయితే రైతులు మాత్రం ఆలోచించి చెప్తామని తెలిపారు. బుధవారం వెంకటాపురం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ గోదాం ఆవరణలో సమావేశం ఆసక్తికరంగా మారింది. అయితే కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్ ఇతర వ్యాధులను కలిగించే పొగాకు సాగును విక్రయించే ఉత్పత్తులను నిషేధించిందని మీరు ఇప్పుడు వచ్చి లంకపోగాకు సాగు చేయమంటాంవిడ్డూరంగా ఉందని పలువురు రైతులు, విద్యావంతులు నిలదీయడంతో అవాకైనటు సమాచారం…